తెలంగాణ: గ్రూప్​ పోస్టుల భర్తీలో మరిన్ని పోస్ట్​ లు

By udayam on November 25th / 6:40 am IST

గ్రూప్‌-2, 3, 4 ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల్లో మరికొన్ని పోస్టులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేర్చింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సాధారణ పరిపాలన శాఖ సవరించింది. గ్రూప్‌-2లో మరో ఆరు రకాల పోస్టులు, గ్రూప్‌-3లో మరో రెండు, గ్రూప్‌-4లో మరో 4 రకాల పోస్టులను చేర్చింది. గ్రూప్‌-2లో రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇతర శాఖలకు చెందిన ఏఎస్‌వో, జువైనల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రొబేషనరీ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులు కూడా ఉంటాయి. గ్రూప్‌-3లో గిరిజన సంక్షేమశాఖ అకౌంటెంట్‌, హెచ్‌వోడీల్లోని సీనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అకౌంటెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులను చేర్చారు.గ్రూప్‌-4లో జిల్లా కార్యాలయాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌, అకౌంటెంట్‌, జువైనల్‌ సర్వీసెస్‌ సూపర్‌ వైజర్‌ మేల్‌, జువైనల్‌ సర్వీసెస్‌ మ్యాట్రన్‌ స్టోర్‌ కీపర్‌, సాంకేతిక విద్యాశాఖ మ్యాట్రన్‌ పోస్టులు చేర్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ట్యాగ్స్​