తెలంగాణ : 783 గ్రూప్​–2 పోస్టులకు నెలాఖరులో నోటిఫికేషన్​!

By udayam on December 22nd / 7:06 am IST

తెలంగాణలో ఖాళీగా ఉన్న గ్రూపు-2 పోస్టుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 783 పోస్టులు ఉన్నట్లు గుర్తించారు. వాటికి సంబంధించిన రోస్టర్‌ పాయింట్లు, సర్వీసు రూల్స్‌ను ఇప్పటికే ఖరారు చేశారు. దీంతో ఈ నెలాఖరులోగానే గ్రూపు-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉంది. నోటిఫికేషన్‌ తర్వాత నెల రోజుల పాటు అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వనున్నారు. అనంతరం రెండు నుంచి మూడు నెలల గడువిచ్చి పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది.

ట్యాగ్స్​