తెలంగాణలో ఉద్యోగ ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్సీ వరుస నోటిఫికేషన్లు ఇస్తున్నది. మరో 207 ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ రెండు వేర్వేరు నోటిఫికేషన్లను ఇచ్చింది. ఈ మేరకు గురువారం టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. వెటర్నరీ డిపార్ట్‌మెంట్‌లో 185 అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ ఏ, బీ) పోస్టులకు ఈ నెల 30 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు.