తెలంగాణలో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి తెరలేచింది. మొత్తం 783 ఉద్యోగాలకు టీఎస్ పీఎస్ సీ నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అత్యధికంగా 165 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (జనరల్ అడ్మినిస్ట్రేషన్) ఉద్యోగ ఖాళీలు ఉండగా, 126 మండల్ పంచాయత్ ఆఫీసర్ పోస్టులు, 98 తహసీల్దార్ పోస్టులు ఉన్నాయి. ఈ గ్రూప్-2 ఉద్యోగాలకు వచ్చే ఏడాది జనవరి 18 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తులకు ఫిబ్రవరి 16 తుది గడువు. www.tspsc.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.