మార్చి 5కి వాయిదా పడ్డ ఏఈఈ ఎగ్జామ్స్​

By udayam on January 9th / 10:49 am IST

టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకటన చేసింది. అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెల్లడించింది. ఫిబ్రవరి 12న జరగాల్సిన ఈ పరీక్షను మార్చి 5కి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. గేట్​ పరీక్ష ఉన్నందున ఏఈఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు ఉద్యోగాలిప్పిస్తామంటూ కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసిందని.. అభ్యర్థులు డబ్బులిచ్చి మోసపోవద్దని సూచించింది.

ట్యాగ్స్​