తెలంగాణలో 276 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు

By udayam on December 29th / 11:54 am IST

తెలంగాణలో మరో రెండు ఉద్యోగ నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేసింది. సాంకేతిక విద్యాశాఖలో 37 పీడీ పోస్టులు, ఇంటర్ విద్యాశాఖలో 91 పీడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అధికారులు చెప్పారు. పోస్టుల వివరాలు, అర్హతలు తదితర వివరాలను టీఎస్ పీఎస్సీ వెబ్ సైట్ లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన వారు వచ్చే నెల 6 వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల(మల్టి జోన్-1 లో 100, మల్టి జోన్-2 లో 48 ఖాళీలు) భర్తీ ప్రక్రియ చేపట్టినట్లు వివరించారు.

ట్యాగ్స్​