దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ విద్యార్థుల గ్రేటర్ హైదరాబాద్ బస్‌పాస్‌లను పరిమితి వరకు అనుమతించాలని టిఎస్ ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయించారు.ప్రస్తుతం సిటీ బస్సుల్లోనే వారి పాసులు చెల్లుబాటు అవుతున్నాయి. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో విద్యార్థుల సాధారణ బస్సు పాసులను అనుమతించటం లేదు. నగర శివారులో సిటీ బస్సులు తక్కువగా తిరిగుతున్నందున వీరు ప్రైవేటు వెహికల్స్‌ను ఆశ్రయిస్తున్నారు.