ప్రముఖ టూరిస్ట్ స్పాట్ అనంతగిరి హిల్స్ వెళ్ళేందుకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసుల్ని నడపనుంది. శనివారం, ఆదివారాల్లో మాత్రమే ఈ బస్సు హైదరాబాద్‌లోని కెపిహెచ్బి బస్టాండ్ నుంచి ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలకు అనంతగిరి చేరుకునే ఈ బస్సు టికెట్ పెద్దలకు రూ.300లు గానూ, పిల్లలకు రూ.150గానూ నిర్ణయించారు. ఈ బస్సులో అనంతగిరి హిల్స్‌తో పాటు పద్మనాభ టెంపుల్, బుగ్గా రామలింగేశ్వర టెంపుల్, కొటెపల్లి రిజర్వాయర్లనూ చుట్టేయొచ్చు.