ఏపీకి స్లీపర్​ బస్సులు తీసుకొచ్చిన టిఎస్​ఆర్టీసీ

By udayam on January 4th / 6:07 am IST

టిఎస్ ఆర్టీసీ మరో గుడ్ న్యూస్ తెలిపింది. ఏపీ ప్రయాణికుల కోసం స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈరోజు నుండి 10 స్లీపర్ బస్సులను అందుబాటులోకి రాబోతున్నాయి. వీటిలో నాలుగు పూర్తిస్థాయి స్లీపర్ బస్సులు కాగా, ఆరు స్లీపర్ కమ్ సీటర్ బస్సులు. ఈ బస్సులు హైదరాబాద్ నుంచి కాకినాడ, విజయవాడ మధ్య పరుగులు పెట్టనున్నాయి. నేటి సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ బస్ స్టాప్ వద్ద టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ వీటిని ప్రారంభిస్తారు.

ట్యాగ్స్​