ఆగ్నేయ ఆసియా దేశం తూర్పు టిమోర్ కోస్తా తీరంలో ఈరోజు భారీ భూకంపం సంభవించింది. హిందూ మహా సముద్రంలో వచ్చిన ఈ భూకంప తీవ్రత 6.4 గా ఉందని భూకంప అధ్యయన శాఖ పేర్కొంది. దీంతో ఈ ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇప్పటి వరకూ ఎలాంటి నష్టం కానీ, ఎవరైనా మరణించినట్లు వార్తలు రాలేదు. అయితే టిమోర్ ప్రాంతంలో భూమి తీవ్రంగా కంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది.