తిరుమల: జనవరి 2 నుంచి వైకుంఠద్వార దర్శనం

By udayam on December 26th / 12:49 pm IST

తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. దర్శన టికెట్లు ఉన్న భక్తులకే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. తిరుపతిలో జనవరి 1వ తేదీ నుంచి 9 చోట్ల టోకెన్లు జారీ చేయనున్నారు. రోజుకు 50 వేల చొప్పున 10 రోజుల పాటు 5 లక్షల టోకెన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. 10 రోజుల కోటా పూర్తయ్యేవరకు ఆఫ్ లైన్ విధానంలో నిరంతరాయంగా టోకెన్లు జారీ చేయనున్నారు.

ట్యాగ్స్​