టిటిడి ఈవో ధర్మారెడ్డి కుమారుడికి గుండెపోటు

By udayam on December 19th / 10:36 am IST

తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహక అధికారి ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 28 ఏళ్ల చంద్రమౌళికి ఇటీవలే పారిశ్రామికవేత్త, టిటిడి చెన్నై సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌రెడ్డి కుమార్తెతో నిశ్చితార్థం జరిగింది. జనవరిలో వీరి వివాహం తిరుమలలో జరగాల్సి ఉంది. ఈక్రమంలో శుభలేఖలు పంచడానికి చెన్నై వెళ్లిన ఆయనకు హార్ట్‌ఎటాక్‌ రావటంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్స్​