టీటీడీ ఈవో ధర్మారెడ్డి కొడుకు చంద్రమౌళి (28) కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. ఆదివారం ఆయనకు గుండెపోటు రాగా చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స అందిసుతున్నారు. అక్కడే ఆయన ఈరోజు కన్నుమూశారు. చంద్రమౌళికి ఇటీవలే చెన్నై స్థానిక టిటిడి సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి కుమార్తెతో వివాహం నిశ్చియమైంది. ఆ పెళ్ళి పత్రికలను పంచడానికి ఆయన చెన్నై వెళ్ళిన సమయంలోనే గుండెపోటు వచ్చింది. ఈ జనవరిలో చంద్రమౌళి వివాహం తిరుమలలో జరగాల్సి ఉండగా ఈ విషాదం చోటు చేసుకుంది.