గదుల అద్దెను భారీగా పెంచేసిన తితిదే

By udayam on January 7th / 6:00 am IST

తిరుమలలో వసతి గృహాల అద్దెను భారీగా పెంచారు. మొన్నటి వరకు రూ.150 ఉన్న రూమ్​ అద్దె ను ఏకంగా రూ.1700లకు పెంచేశారు. తిరుమల కొండపై దాదాపు 6 వేల వసతి గదులు ఉండగా వీటిలో చాలా వాటికి ఇటీవల ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. ఆ వెంటనే వీటి ధరల్ని 50 శాతం నుంచి 150 శాతం వరకూ పెంచుతూ సామాన్య భక్తులను గుడి బయటే నిలువు దోపిడీ చేస్తున్నారు. తిరుమలలో ఉన్న గదులను చాలా వరకూ మధ్య తరగతి వారే తీసుకుంటూ ఉంటారు. డబ్బున్న వాళ్ళు లగ్జరీ హోటళ్ళకు పరిమతమవుతారు. ఇప్పుడు ఈ పెంచిన ధరలను మోయాల్సింది సామన్య భక్తులే.

ట్యాగ్స్​