యాప్​ తీసుకురానున్న టిటిడి

By udayam on May 23rd / 6:04 am IST

ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం తన సేవలన్నింటినీ ఒకే యాప్​ కిందకు తీసుకురావాలని ప్లాన్​ చేస్తోంది. ఈ విషయాన్ని దేవస్థానం ఈఓ ఎవి ధర్మారెడ్డి ఇటీవల వెల్లడించారు. టిటిడి అందించే సేవలతో పాటు ఉత్పత్తుల అమ్మకాలు, లడ్డూ, ప్రసాదం విక్రయాలను సైతం దీని నుంచే జరపడానికి సిద్ధమవుతోంది. అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తులు, డ్రై ఫ్లవర్​ టెక్నాలజీ ఆర్టిఫ్యాక్ట్స్​ను సైతం ఈ యాప్​ సాయంతో దేశవ్యాప్తంగా అమ్మకాలు జరపనుంది.

ట్యాగ్స్​