గతేడాది భారీ వర్షాలకు దెబ్బతిన్న శ్రీవారి మెట్టు మార్గాన్ని ఆధునీకరించిన టిటిడి నేటి నుంచి భక్తులకు ఈ మార్గాన్ని అందుబాటులోకి తేనుంది. సిఎం జగన్ మోహన్ రెడ్డి ఈ మార్గాన్ని నేడు ప్రారంభించనున్నారు. అలిపిరి నుంచి కొండ పైకి 4 గంటల సమయం పడితే.. రెండో కాలిబాట శ్రీవారి మెట్టు నుంచి కేవలం గంటలోనే తిరుమలకు చేరుకోవచ్చు. కేవలం 3 కి.మీ.లు ఉండే ఈ కాలిబాటను భారీ ఎత్తున ప్రజలు వినియోగించుకుంటారు.