తిరుమలలో ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణ కాలుష్యం అవుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్లాస్టిక్‌ని పూర్తిస్థాయిలో నిషేధించింది. భక్తులెవరూ ప్లాస్టిక్ కవర్లలో వస్తువులు కొండపైకి తీసుకురాకూడదని విజ్ఞప్తి చేసింది. జూన్ 1వ తేదీ నుంచి ఈ నిషేధం అమలులోకి వచ్చింది. 2020లోనే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, కవర్లను నిషేధించినా అది క్రమక్రమంగా అమలులోకి వచ్చింది. తాజాగా జూన్ 1 నుంచి మాత్రం అన్ని రకాల ప్లాస్టిక్ వస్తువులపైనా పూర్తిస్థాయి నిషేధాన్ని విధించింది.