టిటిడి ఆధ్వర్యంలో జరిగే సామూహిక వివాహ కార్యక్రమం ‘కళ్యాణ మస్తు’ను తిరిగి టిటిడి బోర్డ్ ప్రారంభించింది. ఆగస్ట్ 7న ఏపీలోని 26 జిల్లాల్లో ఈ కళ్యాణమస్తు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించనున్నట్లు టిటిడి ఈవో వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఆగస్ట్ 7న నక్షత్ర యుత్త సింహలగ్నంలో ఉదయం 8 నుంచి 8.17 నిమిషాల మధ్య ఈ సామూహిక వివాహాలను జరిపిస్తామని చెప్పారు. ఇప్పటి వరకూ 6 విడతల్లో జరిగిన కల్యాణమస్తులో 45 వేల జంటలకు వివాహాలు అయ్యాయి.