తుంగభద్ర పుష్కరాలు ప్రారంభించిన జగన్

By udayam on November 20th / 11:05 am IST

కర్నూలు: డిసెంబర్ 1వరకూ నిర్వహించనున్న తుంగభద్ర పుష్కరాలను శుక్రవారం మధ్యాహ్నం గం 1.21 నిమిషాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు సంకల్‌భాగ్‌ ఘాట్‌లో ఘనంగా ప్రారంభించారు. ‌

ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమంలో పాల్గొన్నారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్‌, గుమ్మనూరు జయరాం, కలెక్టర్‌ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, కంగాటి శ్రీదేవి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, సుధాకర్, తొగురు ఆర్థర్‌ ఉన్నారు.

కోవిడ్‌ నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నా, భక్తుల మనోభావాల మేరకు ఆర్భాటాలు లేకుండా సంప్రదాయరీతిలో, శాస్త్రోక్తంగా నిర్వహించడానికి ప్రత్యేక జాగ్రత్తలతో అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని మంత్రాలయం, ఎమ్మిగనూరు, నందికొట్కూరు, కోడుమూరు, కర్నూ లు నియోజకవర్గాల్లో పుష్కరాలకు ఏర్పాట్లు చేశారు.

5వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఘాట్ల వద్ద ప్రత్యేకంగా గజ ఈతగాళ్లను పెట్టారు. కాగా మంత్రాలయం పీఠాధిపతులు సుబుదేంద్ర తీర్థులు విఐపి ఘాట్ లో పుష్కరిణి విగ్రహాన్ని ఆవిష్కరించారు.