భారత్ నుంచి గోధుమల లోడుతో వెళ్ళిన ఓ భారీ షిప్పును టర్కీ అధికారులు తిప్పి పంపారు. ఈ గోధుమల్లో ఫైటోశానిటరీ వైరస్ జాడలు ఉన్నట్లు చెప్పిన ఆ దేశం ఈ గోధుమలను తాము దిగుమతి చేసుకోలేమని మే 29న ఈ లోడ్‌ను భారత్‌కు రిటర్న్ చేసేశారు. ఈ భారీ షిప్పులో ఏకంగా 1.5 మిలియన్ టన్నుల గోధుమలు ఉన్నట్లు భారత వ్యాపార వర్గాలు వెల్లడించాయి. టర్కీలోని కండ్లా పోర్ట్ నుంచి బయల్దేరిన ఈ షిప్పులో 56,877 టన్నుల గోధుమ పిండి కూడా ఉందని భారత్ పేర్కొంది.