జెరూసలెంలో వరుస పేలుళ్లు .. ఇద్దరి పరిస్థితి విషమం

By udayam on November 23rd / 10:16 am IST

జెరూసలెంలో బుధవారం వరుస పేలుళ్లు జరిగాయి. ఏడుగురికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఇజ్రాయిల్‌ అంబులెన్స్‌ సర్వీస్‌ పేర్కొంది. జెరూసలెం ప్రవేశద్వారం వద్ద బస్‌స్టాప్‌ సమీపంలో మొదటి పేలుడు జరిగింది. మొదటి పేలుడు జరిగిన కొద్ది సేపటికే రామోట్‌ జంక్షన్‌లోని బస్సు వద్ద మరో పేలుడు జరిగింది. వరుస పేలుళ్ల కారణంగా జెరూసలెంలోకి వెళ్లే రోడ్‌ వన్‌ను మూసివేసినట్లు ఇజ్రాయిల్‌ ఆర్మీ తెలిపింది. మృతులకు సంబంధించిన వివరాలు లేవని ఇజ్రాయిల్‌ ఆర్మీ పేర్కొంది.

ట్యాగ్స్​