విజయవాడ హైవేపై అబ్దుల్లాపూర్ మెట్ పిఎస్ పరిధిలో నిన్న కలకలం రేపిన జంట హత్యల కేసును పోలీసులు ఛేధించారు. మృతురాలు జ్యోతి (28) భర్తే ఈ హత్యలను చేశాడని పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యలకు ప్రధాన కారణమని చెప్పిన పోలీసులు.. జ్యోతి భర్త వీరిని 30 కి.మీ.లు వెంబడించి మరీ స్క్రూడ్రైవర్‌తో హత్య చేశాడని ప్రకటించారు. ఈ కేసులో జ్యోతి భర్త శ్రీనివాస్‌కు మరో 5 గురు సైతం సహకరించారని తెలిపారు.