ట్విట్టర్ సిఈవో పరాగ్ అగర్వాల్ ఆ కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్‌లలో ఇద్దరిని తొలగించాడు. ట్విట్టర్ హెడ్ ఆఫ్ ప్రొడక్ట్‌గా ఉన్న బెక్పూర్ను, రెవెన్యూ హెడ్ బ్రూస్ ఫలాక్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. దాంతో పాటు సంస్థలో కొత్తగా ఉద్యోగ నియామకాలను సైతం నిలిపివేస్తున్నట్లు పరాగ్ వెల్లడించారు. రాబోయే 6 నెలల్లో ట్విట్టర్ కొనుగోలు డీల్‌ను పూర్తి చేశాక ఎలన్ మస్క్.. సీఈఓ పరాగ్ అగర్వార్ను సైతం తప్పిస్తారని తెలుస్తోంది.