ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ట్విట్టర్ భారత్‌లో 48,624 అకౌంట్లను నిషేధించింది. అందులో న్యూడిటీ, పిల్లలపై లైంగిక దోపిడి, ప్రోత్సాహించేలా ఉండడమే అందుకు కారణంగా తెలిపింది. సదరు అకౌంట్లు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 25 మధ్య కాలంలో ట్విటర్ నియమాలను ఉల్లంఘించినట్లు వెల్లడించింది. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ట్విట్టర్ సంస్థ తన నెలవారీ కంప్లయెన్స్ రిపోర్ట్ లో ఈ విషయాలను వెల్లడించింది.