కొరియా యూట్యూబర్​ కు నడిరోడ్డుపై వేధింపులు

By udayam on December 1st / 11:08 am IST

ముంబైలో ఇద్దరు యువకులు ఓ సౌత్​ కొరియా మహిళా యూట్యూబర్ ను నడిరోడ్డుపై వేధించారు. సౌత్‌ కొరియాకు చెందిన బాధిత యువతి యూట్యూబర్‌ గా రాణిస్తోంది. మంగళవారం రాత్రి ఆమె రోడ్డుపై వెళ్తుండగా ఇద్దరు యువకులు ఆమెను వేధింపులకు గురి చేశారు. ఆమె చేయి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించారు. యువతి లైవ్ స్ట్రీమింగ్‌ లో ఉండగా ఆ యువకులు ఆమె చేయి పట్టుకుని బైక్ వద్దకు లాగారు. ఆమె ‘నో’ అంటూ తప్పించుకుంది. తన ఇళ్లు దగ్గరేనని చెప్పింది. ఒకడు ఆమెకు ముద్దు పెట్టే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్​