వైరల్​ వీడియో : ఫుట్​బాల్​ ఆడుతున్న ఎలుగు

By udayam on September 14th / 12:27 pm IST

ఫుట్​బాల్​ను ఇష్టపడని వారు ఎవరుంటారు. ఎక్కడ దొరికిందో ఏమో కానీ ఓ రెండు ఎలుగుబంట్లకు అడవిలో ఫుట్​బాల్​ దొరికింది. దాంతో తల్లి ఎలుగుబంటి ఆడుకుంటున్న వీడియో ఒకటి వైరల్​ అవుతోంది. ఒడిశాలోని నబరంగపూర్​ జిల్లాలోని అటవీ ప్రాంతంలో తీసిన ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. తల్లి ఎలుగుబంటి బంతిని చేతితో కొడుతూ అది పైకి లేచాక చిన్న ఎలుగు దాని చుట్టూ తిరగడం వీడియోలో కనిపిస్తోంది.

ట్యాగ్స్​