హెల్త్​ బులిటెన్​: చికిత్సకు స్పందిస్తున్న రిషబ్​ పంత్​

By udayam on December 30th / 9:40 am IST

నిన్న రాత్రి ఘోర రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలతో బయటపడ్డ క్రికెటర్​ రిషబ్​ పంత్​ పరిస్థితిపై వైద్యులు బులిటెన్​ ను విడుదల చేశారు. డెహ్రాడూన్​ లోని మ్యాక్స్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పంత్​ కు ఆర్ధోపెడిక్​, ప్లాస్టిక్​ సర్జన్ల పర్యవేక్షణలో పరీక్షలు జరిపారు. ప్రస్తుతం అతడికి స్వల్ప గాయాలు మాత్రమే అయినట్లు నిర్ధారించిన వైద్యులు పరీక్షల రిపోర్ట్స్​ వచ్చిన తర్వాత మరోసారి హెల్త్​ బులిటెన్​ ను విడుదల చేస్తామన్నారు. అతడు చికిత్సకు స్పందిస్తున్నాడని, ప్రశ్నలకు సమాధానాలూ ఇస్తున్నట్లు వెల్లడించారు.

ట్యాగ్స్​