జమ్మూలో సైనిక శిబిరం వద్ద కాల్పులు.. ఇద్దరు మృతి

By udayam on December 16th / 11:12 am IST

జమ్మూ- కశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం ఉదయం ఓ సైనిక శిబిరం బయట జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తలు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. గుర్తుతెలియని ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. ఆర్మీకి చెందిన ‘వైట్ నైట్ కోర్‌’ ఈ మేరకు ఓ ట్వీట్‌ చేసింది. మరోవైపు.. ఈ ఘటనపై స్థానికులు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. మిలిటరీ క్యాంప్‌పైకి రాళ్లు రువ్వారు.పట్టణంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ.. అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్​