దేశవ్యాప్తంగా 2,41,826 అంగన్ వాడీ ఉద్యోగులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖమంత్రి స్మృతి ఇరానీ పార్లమెంట్ లో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో 3,455, తెలంగాణలో 5,578 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. 2022 జూన్ 30 నాటికి ఏపిలో 1,240 అంగన్‌వాడీ వర్కర్స్ పోస్టులు పెండింగ్‌లో ఉన్నాయని, 2,304 అంగన్‌వాడీ హెల్పర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.దేశవ్యాప్తంగా 1,27,564 అంగన్‌వాడీ వర్కర్స్ పోస్టులు, 1,14,262 అంగన్‌వాడీ హెల్పర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు.