మీనా: నా అవయవాలు దానం చేస్తా

By udayam on August 15th / 5:18 am IST

భర్త హఠాన్మరణం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సీనియర్​ నటి మీనా సంచలన నిర్ణయం తీసుకుంది. తన మరణానంతరం అవయవాలను దానం చేస్తున్నట్లు ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేసింది. ‘ప్రాణాలను కాపాడటం కంటే గొప్ప పని ఇంకోటి ఉండదు. అవయవాలను దానం చేయడం ద్వారా ఒక వ్యక్తి 8 మందిని కాపాడవచ్చు. అనారోగ్యంతో బాధపడుతుంటే.. ఒకరికి అవయవాలు దానం చేయడం వల్ల వారి కుటుంబంలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయో నేను కళ్లారా చూశాను. మా సాగర్‌కు(మీనా భర్త) ఇంకా అలాంటి దాతలు దొరికి ఉంటే నా జీవితం ఇంకోలా ఉండేది’ అంటూ మీనా పోస్ట్​ చేసింది.

ట్యాగ్స్​