కశ్మీర్ పండిట్ను అతడి కార్యాలయంలోనే కాల్చి చంపిన ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. వీరిద్దరూ లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారని భద్రతా దళాలు వెల్లడించాయి. శుక్రవారం ఉత్తర కశ్మీర్లోని బంధిపోరా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఈ ముష్కరులను సైన్యం ఏరిపారేసింది. ఫైసల్ అలియాస్ సికందర్, అబు ఉకాసా అనే ఈ ఇద్దరు టెర్రరిస్టులు కశ్మీర్ వ్యాలీలో పలువురిని హత్య చేశారని జమ్మూ పోలీసులు తెలిపారు.