కృష్ణా జిల్లాలోని మంగినపూడి బీచ్ వద్ద ఇద్దరు బిఫార్మసీ విద్యార్థినులు నీట మునిగి మృతి చెందారు. మృతి చెందిన వారిని కాకర ప్రమీల (22), కాళ్ళేపల్లి పూజిత (22)లుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ భీమవరంలోని విష్ణు ఫార్మసీ కాలేజీలో చదువుతున్నారని పోలీసులు వెల్లడించారు. సోమవారం ఉదయం వీరితో పాటు మరో ఇద్దరు విద్యార్థినులు సైతం వారి వారి కుటుంబాలతో కలిసి బీచ్‌కు వెళ్ళి స్నానాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.