ఎన్​కౌంటర్లో ఇద్దరు మిలిటెంట్లు హతం

By udayam on May 30th / 9:32 am IST

జమ్మూ కశ్మీర్​లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారని ఆ రాష్ట్ర ఐజి ప్రకటించారు. ఆదివారం సాయంత్రం మొదలైన జాయింట్​ యాంటీ మిలిటెన్సీ ఆపరేషన్​లో భాగంగా పుల్వామాలోని గుండిపోరా ప్రాంతంలో దాక్కున్న ఇద్దరు ముష్కరులను ఏరేశామని, వీరిద్దరూ జైషే ఈ మహమ్మద్​ ఉగ్రవాద ముఠాకు పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 1‌‌‌‌0 గంటల పాటు సాగిన ఎదురు కాల్పుల్లో సోమవారం తెల్లవారుఝామున వీరిద్దరినీ మట్టుబెట్టడంతో ముగిశాయని తెలిపారు.

ట్యాగ్స్​