బైక్ బయ్యర్స్ కి షాకిచ్చిన టూవీలర్స్ కంపెనీలు

By udayam on January 13th / 6:13 am IST

న్యూఢిల్లీ: కరోనా తర్వాత బైక్ ల కొనుగోళ్లు బాగానే పెరిగాయి. రోడ్ల మీద చూస్తున్న ట్రాఫిక్ ఇందుకు నిదర్శనం. అయితే ఇదే అదనుగా టూవీలర్స్ కంపెనీలు వినియోగదారులకు షాకిచ్చాయి.

టీవీఎస్ మోటార్ కంపెనీ, బజాజ్ ఆటో, రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశంలో తమ మోటార్‌సైకిళ్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. టీవీఎస్ తన ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ అపాచీ ధరలను పెంచగా, బజాజ్ ఆటో, రాయల్ ఎన్‌ఫీల్డ్ వారి మొత్తం మోటార్‌సైకిల్ శ్రేణి ధరలను పెంచాయి.

పెంచిన ఈ కొత్త ధరలు జనవరి 2021 నుంచి తయారు చేయబడిన, విక్రయించే బైక్‌లు, స్కూటర్లపై పెంపు ధరలు వర్తిస్తాయని వెల్లడించాయి.

టీవీఎస్ సంస్థ తన ప్రధాన మోటారుసైకిల్ అపాచీ ఆర్ఆర్ 310 ధరలను రూ.3 వేలకు పెంచడంతో ఇప్పుడు 2.48 లక్షల రూపాయలకు చేరింది. అపాచీ ఆర్టీఆర్ 200 4వీ ధరను రూ.2,000 పెరిగి 1.33 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ముంబై) లభిస్తుంది.

అపాచీ ఆర్టీఆర్ 160 4వీ ధర రూ.1,770, ఆర్టీఆర్ 180, ఆర్టీఆర్ 160 ధరలు వరుసగా రూ.1770, రూ.1520 పెంచేసారు. ఇక  బజాజ్ సంస్థ తన అవెంజర్ క్రూయిజర్ 220 ధరలను 3,521 రూపాయలు పెంచడంతో ఇప్పుడు రూ .1.24 లక్షలు అయింది.

డొమినార్ 400, డొమినార్ 250 ధరలను వరుసగా 3,480 , 3,500 రూపాయలు వరకు పెంచారు. పల్సర్ 220ఎఫ్ ధరను రూ.3,500 పెంచడంతో  రూ.1.25 లక్షలకు చేరుకుంది. ఎన్‌ఎస్‌160, ఎన్‌ఎస్‌ 200 ధరలను వరుసగా రూ.3,000, రూ.3,500 పెంచారు.

ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ఆర్ఈ క్లాసిక్ 350 ధరలను సుమారు రూ.2,000 పెంచడంతో ఇప్పుడు రూ.1.63 లక్షలు నుంచి రూ.1.85 లక్షల మధ్య ధర పలుకుతోంది.

బుల్లెట్ సిరీస్ ధరలు కూడా పెరగడంతో  రూ.1.27 లక్షల నుంచి 1.43 లక్షల కు చేరాయి. క్లాసిక్, బుల్లెట్ బైక్స్ వంటి బైక్స్ ధర రూ.2 వేల వరకు పైకి చేరింది. మెటిరో 350 ధర కూడా రూ.3 వేలు పెంచేశారు.