ఒడిశాలో గురువారం జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మహిళా నక్సలైట్లు హతమయ్యారు. కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్ట్) దళానికి చెందిన గంధమర్ధన్ కొండ ప్రాంత యూనిట్ లో వీరు సభ్యులుగా పోలీసులు గుర్తించారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మేరకు నక్సలైట్ల కదలికలను గుర్తించిన పోలీసులు వారిని మట్టుబెట్టినట్లు ఒడిశా డిజిపి సునీల్ భన్సల్ వెల్లడించారు. సరెండర్ కావాలని పదే పదే విజ్ఞప్తి చేసినా కాల్పులు జరిపారని, దీంతో ఎదురుకాల్పులు జరిపి వారిని మట్టుబెట్టినట్లు ఆయన వెల్లడించారు.