యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ ఖలీఫా కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. అనారోగ్యమే ఆయన మృతికి ప్రధాన కారణమని తెలుస్తోంది. 73 ఏళ్ళ ఖలీఫా 2014 నుంచి ఆ దేశానికి యుఏఈకి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తండ్రి షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ నుంచి వారసత్వ బాధ్యతలు తీసుకున్న ఆయన ఆ దేశానికి రెండో అధ్యక్షుడు. ఆయన మృతితో ఆ దేశంలో 40 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు. 3 రోజుల పాటు అన్ని ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.