మన పాలపుంతలోనే సుదూరంగా ఉన్న 22 భారీ కృష్ణ బిలాల వీడియోలను నాసా విడుదల చేసింది. కాంతి కూడా తప్పించుకోలేని గురుత్వాకర్షణ శక్తితో ఉన్న ఈ కృష్ణ బిలాల కదలికలను 22 వేల రెట్ల వేగానికి పెంచి ఓ ప్రత్యేక వీడియోను రూపొందించింది. వీటి ఉష్ణోగ్రతలు మన సూర్యుని కంటే 5 రెట్ల వేడిగానూ.. కొన్ని 45 శాతం తక్కువగానూ ఉన్నాయని తెలిపింది. మన సూర్యుడి కంటే 20 రెట్ల పెద్దదైన నక్షత్రాలు అంత్యదశకు చేరుకున్న క్రమంలో ఈ భారీ బ్లాక్ హోల్స్ ఏర్పడతాయని పేర్కొంది.