సిఎం పదవికి ఉద్ధవ్​ రాజీనామా..

By udayam on June 29th / 6:06 pm IST

మహారాష్ట్ర సిఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. ఈ బలపరీక్ష జరగకుండా ఆపాలంటూ ఉద్ధవ్​ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళగా.. అక్కడ స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించడంతో పాటు ఓటు వేయడానికి జైలులో ఉన్న నవాబ్​ మాలిక్​, అనిల్​ దేశ్​ముఖ్​లకు సైతం అనుమతి ఇచ్చింది. సుప్రీం తీర్పు వెలువడిన తర్వాత ఫేస్‌బుక్​లో మాట్లాడిన ఉద్ధవ్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనకు మద్దతుగా నిలిచిన ఎన్సీపీ, కాంగ్రెస్‌కు కృతజ్ఞతలు చెబుతూ సుప్రీం తీర్పును గౌరవిస్తామన్నారు.

ట్యాగ్స్​