ముంబైలో రెడ్​ అలెర్ట్​ వర్షాలు

By udayam on June 9th / 10:59 am IST

ఇప్పటి వరకూ కరోనాతో వణికిన ముంబై మహానగరం వచ్చే వారం రోజుల పాటు భారీ వర్షాలతో మునగనుంది. ఇప్పటికే ఈ సిటీని ముంచెత్తుత్తున్న ఈ వర్షాల ధాటికి ముంబైలో ఈరోజు రెడ్​ అలెర్ట్​ జారీ చేశారు. వచ్చే 4–5 రోజుల పాటు ఆరెంజ్​ అలెర్ట్​ను బృహణ్​ ముంబై కార్పొరేషన్​ జారీ చేసింది. రెండు రోజుల ముందుగానే ఈ ఆర్ధిక రాజధానిని తాకిన రుతుపవనాలు అక్కడ కుండపోత వర్షాల్ని కురిపిస్తున్నాయి. దీంతో ముంబైలోని సబర్బన్​ రైళ్ళ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి.

ట్యాగ్స్​