ఉగాండ: ఎబోలాను అంతమొందించాం

By udayam on January 11th / 11:21 am IST

తమ దేశం నుంచి ఎబోలా వైరస్​ ను విజయవంతంగా పారద్రోలామని ఉగాండా ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది. నాలుగు నెలల క్రితం ఈ దేశంలో మళ్ళీ విజృంభించిన ఈ వైరస్​ వల్ల మొత్తం 55 మంది పౌరులు మరణించారు. ఉగాండా లో ఎబోలా అంతమొందిందని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ప్రకటించింది. ఈ తూర్పు ఆఫ్రికా దేశాన్ని ఈ ప్రమాదకర వైరస్​ దాదాపు 113 రోజుల పాటు పట్టి పీడించింది. దీంతో యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు టెస్టులు, ఎబోలా బారిన పడకుండా ఉండే పద్దతులను అక్కడి ప్రభుత్వం ప్రజలకు అలవాటు చేసింది.

ట్యాగ్స్​