ఉక్రెనియన్ శరణార్ధులకు ఇప్పటివరకు అందచేస్తున్న ఉచిత సేవలను వెనక్కి తీసుకోవాలని బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయించింది. క్లిష్టమైన ఆర్థిక పరిస్థితులు నెలకొన్నాయంటూ ప్రభుత్వం హెచ్చరించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి కొత్త నిబంధనలను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు కొత్త విధానాన్ని వివరిస్తూ శరణార్ధులకు లేఖ అందింది. దాదాపు 1500మంది శరణార్ధులకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి.