యూకేలోని లాబర్ పార్టీకి చెందిన కౌన్సిలర్ మొహిందర్ కె మిధా పశ్చిమ లండన్‌లోని ఈలింగ్ కౌన్సిల్‌కు మేయర్‌గా ఎన్నికయ్యారు. లండన్ కౌన్సిల్‌కు ఎన్నికైన తొలి దళిత మహిళగా మిధా రికార్డ్ సృష్టించారు. 2022–23 ఏడాదికి గానూ ఆమె మేయర్‌గా కొనసాగనున్నారు. ఆమె విజయంపై గర్వ పడుతున్నట్లు లేబర్ పార్టీ ప్రకటించింది. బ్రిటిష్ దళిత కమ్యూనిటీ ఆమె విజయానికి ఘనంగా సెలబ్రేట్ చేస్తోంది.