ఆలస్యంతో అలసిపోయిన పైలట్​.. ఏం చేశాడంటే!

By udayam on May 27th / 12:02 pm IST

ప్రయాణానికి సిద్ధమైన విమానం రన్​ వే పై గంటల తరబడి ఆగిపోతే ప్రయాణికులు ఆందోళన చేయడం మనం చూసుంటాం.. లేదా వినుంటాం.. కానీ లండన్​లోని గట్​విక్​ విమానాశ్రయంలో ఇలా 7 గంటలు పాటు ఆగిపోయిన ఓ సైప్రస్​ విమానంలో మాత్రం కథ వేరే జరిగింది. ఈ ఆలస్యం పైలట్​ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ విమానం నుంచి ప్రయాణికులను దిగిపోవాలని ఆదేశించాడు. ‘నేను, నా సిబ్బంది అలసిపోయాం. ఈ రాత్రికి మనం ఎక్కడికీ వెళ్ళం. దయచేసి అందరూ దిగిపోండి’ అంటూ అతడు చెప్పడంతో ప్రయాణికులకు దిక్కుతోచలేదు.

ట్యాగ్స్​