లిజ్​ ట్రస్​: నన్ను క్షమించండి.. తప్పులు చేశా

By udayam on October 18th / 10:24 am IST

బ్రిటన్​ ప్రజలకు ఆ దేశ కొత్త ప్రధాని బహిరంగ క్షమాపణలు చెప్పారు. ప్రజలపై పన్నుల భారం తగ్గిస్తానని ప్రధాని ఎన్నికల సమయంలో చెప్పిన ఆమె.. చెప్పినట్లే ప్రధాని అయిన తర్వాత పన్నులు తగ్గించారు. అయితే ఇలా చేయడం వల్ల బ్రిటన్ ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది. ఈ క్రమంలోనే ఆర్థిక మంత్రి క్వాసి క్వార్టెంగ్‌ను ఆమె పదవి నుంచి తప్పించారు. ఈ పదవిలోకి వచ్చిన జెరెమీ హంట్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను తోసిపుచ్చారు. ఈ సందర్భంగా లిజ్ మాట్లాడుతూ.. ‘జరిగిన తప్పులకు బాధ్యత వహించి క్షమాపణలు చెప్పాలని అనుకుంటున్నా. మేం మరీ వేగంగా చాలా దూరం పరిగెత్తాం’ అని అన్నారు.

ట్యాగ్స్​