అవిశ్వాసం నెగ్గిన బ్రిటన్ ప్రధాని జాన్సన్

By udayam on June 7th / 5:33 am IST

బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ తనపై సోమవారం ఆ దేశ పార్లమెంట్​లో జరిగిన అవిశ్వాస తీర్మానంలో విజయం సాధించారు. కన్జర్వేటివ్​ పార్టీకి చెందిన ఈయనపై జరిగిన ఈ అవిశ్వాస ఓటింగ్​లో ఆయనకు అనకూలంగా 211 ఓట్లు రాగా.. 148 మంది ఆయనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. కోవిడ్ ఆంక్షలున్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి పార్టీలకు హాజరయ్యారనే ఆరోపణలు బోరిస్ మీద ఉన్నాయి. ప్రజల జీవన వ్యయం పెరగడం, పన్నులు పెంచడం మీద కూడా కొందరు టోరీ ఎంపీలు అసంతృప్తితో ఉన్నారు.

ట్యాగ్స్​