పుతిన్ ఓ వైపు హెచ్చరిస్తున్నా బ్రిటన్ మాత్రం ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాను తగ్గించడం లేదు. అత్యంత సుదూర లక్ష్యాలను ఛేధించగల 70270 మల్టిపుల్ రాకెట్ వ్యవస్థలను ఉక్రెయిన్‌కు అందించామని యుకె రక్షణ మంత్రి బెన్ వాలెస్ వెల్లడించారు. ఈ ఆయుధాలు ఉక్రెయిన్‌కు శత్రువుల దాడి నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన చెప్పుకొచ్చారు. అమెరికా నిఘా నీడలో ఈ ఆయుధాలు ఉక్రెయిన్‌కు చేరనున్నట్లు తెలుస్తోంది.