యుద్ధంతో అతలాకుతలమైన ఉక్రెయిన్ లో ఘోర హెలికాఫ్టర్ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆ దేశ హోం మంత్రి డెవిస్ మొనాస్టిర్ స్కీ తో సహా 16 మంది (ఇందులో ఇద్దరు చిన్నారులు) మరణించారు. మృతుల్లో డిప్యూటీ హోంమంత్రి యెవ్ గెనీ యెనిన్, సహాయ మంత్రి యూరీ లుబ్కోవిచ్ కూడా ఉన్నట్లు అంతర్జాతీయ వెబ్ సైట్లు రాస్తున్నాయి. నివాస సముదాయాల మధ్య ఉన్న కిండర్ గార్డెన్ స్కూల్ సమీపంలో ఈ హెలికాఫ్టర్ కూలినట్లు వీడియో దృశ్యాల్లో కనిపిస్తున్నాయి. దాని వల్లే చిన్నారుల మరణాలు సంభవించాయి.
Viral video of Ukraine's #HelicopterCrash . pic.twitter.com/kqJq6wxPqm
— Tajamul Fayaz (@TajamulFayaz621) January 18, 2023