ఉక్రెయిన్​ దాడిలో ఒకేసారి 500ల మంది రష్యా సైనికులు మృతి

By udayam on January 3rd / 11:46 am IST

తమ దేశంపై దండెత్తిన రష్యాపై ఉక్రెయిన్​ భారీ ప్రతీకారం తీర్చుకుంది. జనవరి 1వ తేదీన రష్యా సైనికులు ఉన్నట్లు భావిస్తున్న ఓ భారీ భవంతిపై రాకెట్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్​ ఏకంగా 400 ల మంది రష్యన్​ సైనికులను హతమార్చింది. అయితే ఈ దాడిలో తమ సైనికులు 63 మంది మాత్రమే మరణించారని రష్యా చెప్పుకుంటోంది. ఉక్రెయిన్​ నుంచి ఆక్రమించుకున్న డోనెట్స్క్​ ప్రాంతంలోని ఓ బిల్డింగ్​ లో రష్యా సైనికులు ఉన్నారన్న పక్కా సమాచారంతో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న క్షిపణులతో ఉక్రెయిన్​ సైన్యం ఈ దాడికి దిగింది.

ట్యాగ్స్​