నల్ల సముద్రంలో పహారా కాస్తున్న రష్యా గస్తీ నౌకలను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. ‘రష్యాకు చెందిన రెండు రాప్టర్ బోట్లను స్నేక్ ఐలాండ్ సమీపంలో డ్రోన్ల సాయంతో ధ్వంసం చేశాం’ అని ఉక్రెయిన్ రక్షణ శాఖ సైతం ఓ ప్రకటనను విడుదల చేసింది. టర్కీ నుంచి అందిన ఈ డ్రోన్లు యుద్ధంలో సమగ్రమైన పనితీరును కనబరుస్తున్నట్లు తెలిపింది. ఇటీవల ఉక్రెయిన్ దళాలు రష్యాకు చెందిన మోస్క్వా యుద్ధ నౌకను ముంచేసిన అనంతరం యుద్ధం తీవ్రమైన సంగతి తెలిసిందే.