ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్‌స్కీతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఫోన్‌లో మాట్లాడారు. ఈ సంభాషణలో ప్రస్తుతం భారత దేశం అధ్యక్షత వహిస్తున్న జి-20 ప్రెసిడెన్సీ గురించి మోడీ చర్చించారు. తన ’10 పాయింట్ల శాంతి ప్రణాళిక’కు మద్దతు ఇవ్వాలని మోడీని జెలెన్‌స్కీ కోరారు. ప్రస్తుత యుద్ధ సమయంలో భారత్ అందిస్తున్న సహాయానికి జెలెన్‌స్కీ కృతజ్ఞతలు తెలిపారు. ఇద్దరు నేతలూ ఫోన్ ద్వారా సంభాషించుకోవడం ఈ ఏడాదిలో ఇది నాలుగోసారి.